![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 334 లో.. కావ్య, ఇందిరాదేవి, రాజ్ ఇంటికొచ్చేస్తారు. ఇక రుద్రాణి, ధాన్యలక్ష్మి, అపర్ణ గొడవ కోసం రెడీగా ఉంటారు. కావ్య రాగానే.. అ రెండు లక్షలు ఏం చేశావ్? మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చొచ్చావా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. దాంతో కావ్య ఆశ్చర్యపోతుంది.
ఇక రుద్రాణి, ధాన్యలక్ష్మి, అనామికల ప్లాన్ తెలుసుకున్న స్వప్న తన చెల్లి కోసం కొత్త డ్రామాని ప్లే చేస్తుంది. తన చెల్లి కొత్తగా ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వెళ్తోంది కదా ఇంట్లో వాళ్ళకి ఏం అయిన అవసరాలు ఉంటే ఇవ్వమని తను నాకు ఇచ్చిందని స్వప్న చెప్తుంది. దాంతో ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు. కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో స్వప్న వచ్చేసి నా చెల్లిని ఇప్పటి దాకా అన్నారు కదా.. ఇప్పుడు మాట్లాడండి అని అంటుంది. ఇక సుభాష్, ప్రకాశ్ కలిసి ధాన్యలక్ష్మి, రుద్రాణీల మీద మండిపడతారు. ఇక స్వప్న తెచ్చిన డబ్బులు తీసుకున్న అపర్ణ.. బాగా చూడండి ధాన్యలక్ష్మి, రుద్రాణి అంటు ఆ డబ్బులను చూపిస్తుంది. కాసేపటికి అక్కడి నుండి ధాన్యలక్ష్మి, రుద్రాణి జారుకుంటారు. ఎప్పుడు ఎదుటివారి మీద బురద జల్లుదామా అని కొందరు ఎదురుచూస్తుంటారని అపర్ణ వారిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతుంది. కాపటికి ఎక్కడి వారు అక్కడికి వెళ్తారు . ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి.. అన్నీ మర్చిపోయి నీ కాపురాన్ని చక్కదిద్దుకో అని చెప్తుంది.
ఇక రుద్రాణి, రాహుల్ ఆ డబ్బు స్వప్నకి ఎక్కడివని తలలు పట్టుకుంటారు. బీరువాలో రుద్రాణి దాచుకున్న రెండు లక్షలతో పాటు మిగిలిన మూడు లక్షలు కూడా తీస్తుంది స్వప్న. ఇక రుద్రాణి ఏడుస్తూ సగమే పోయిందనుకున్నా.. అన్నయ్యల దగ్గర, అమ్మనాన్నల దగ్గర ఇంతకాలం అడక్కున్న డబ్బంతా ఆ రాక్షసి లాగేసుకుందని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. అది విని రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఇక స్వప్న వచ్చి నా చెల్లి జోలికి వస్తే మీ వేలితో మీ కంటినే పొడిపిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక స్వప్నని చూసిన కావ్య.. నువ్వు మారిపోయావ్ అక్క అంటు ఎమోషనల్ అవుతుంది. లేదు నేను రాక్షసినే అని స్వప్న అంటుంది. కాసేపటికి తన గదిలోకి వెళ్తుంది కావ్య. తను గదిలోకి రావడం చూసి శ్వేతతో రాజ్ ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. ఇక కావ్య తన డ్రామాను స్టార్ట్ చేస్తుంది. తరువాయి భాగంలో సర్ ప్రైజ్ అని చెప్పావ్ కదా వెళ్లి రెడీ అవ్వు అని కిచెన్ లో ఉన్‌న కావ్యతో ఇందిరాదేవి అంటుంది. దాంతో తొందర తొందరగా కావ్య రెడీ అవుతుంటుంది. అసలేంటా సర్ ప్రైజ్ అని కావ్యని రాజ్ అడుగగా.. ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళొచ్చాక చెప్తానని కావ్య సిగ్గుపడుతూ చెప్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |